మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Bhoothanatha Dasakam – శ్రీ భూతనాథ దశకం


పాండ్యభూపతీంద్రపూర్వపుణ్యమోహనాకృతే
పండితార్చితాంఘ్రిపుండరీక పావనాకృతే |
పూర్ణచంద్రతుండవేత్రదండవీర్యవారిధే
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || 1 ||

ఆదిశంకరాచ్యుతప్రియాత్మసంభవ ప్రభో
ఆదిభూతనాథ సాధుభక్తచింతితప్రద |
భూతిభూష వేదఘోషపారితోష శాశ్వత
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || 2 ||

పంచబాణకోటికోమలాకృతే కృపానిధే
పంచగవ్యపాయసాన్నపానకాదిమోదక |
పంచభూతసంచయ ప్రపంచభూతపాలక
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || 3 ||

చంద్రసూర్యవీతిహోత్రనేత్ర నేత్రమోహన
సాంద్రసుందరస్మితార్ద్ర కేసరీంద్రవాహన |
ఇంద్రవందనీయపాద సాధువృందజీవన
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || 4 ||

వీరబాహువర్ణనీయవీర్యశౌర్యవారిధే
వారిజాసనాదిదేవవంద్య సుందరాకృతే |
వారణేంద్రవాజిసింహవాహ భక్తశేవధే
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || 5 ||

అత్యుదారభక్తచిత్తరంగనర్తనప్రభో
నిత్యశుద్ధనిర్మలాద్వితీయ ధర్మపాలక |
సత్యరూప ముక్తిరూప సర్వదేవతాత్మక
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || 6 ||

సామగానలోల శాంతశీల ధర్మపాలక
సోమసుందరాస్య సాధుపూజనీయపాదుక |
సామదానభేదదండశాస్త్రనీతిబోధక
పూర్ణపుష్కలసమేత భూతనాథ పాహి మామ్ || 7 ||

సుప్రసన్నదేవదేవ సద్గతిప్రదాయక
చిత్ప్రకాశ ధర్మపాల సర్వభూతనాయక |
సుప్రసిద్ధ పంచశైలసన్నికేతనర్తక
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || 8 ||

శూలచాపబాణఖడ్గవజ్రశక్తిశోభిత
బాలసూర్యకోటిభాసురాంగ భూతసేవిత |
కాలచక్ర సంప్రవృత్తి కల్పనా సమన్విత
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || 9 ||

అద్భుతాత్మబోధసత్సనాతనోపదేశక
బుద్బుదోపమప్రపంచవిభ్రమప్రకాశక |
సప్రథప్రగల్భచిత్ప్రకాశ దివ్యదేశిక
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || 10 ||

ఇతి శ్రీ భూతనాథ దశకమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.